“రాక్షసుడు” రీమేక్ లో ఆ బాలీవుడ్ స్టార్.?

Published on Jun 30, 2021 1:00 pm IST

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా రీమేక్స్ సహజం.. అలా మన దక్షిణాది సినిమాల నుంచి అయితే చేసే రీమేక్స్ కన్నా మన నుంచి వెళ్లే రీమేక్ చిత్రాలే అధికంగా ఉంటాయి. మరి అలా కోలీవుడ్ లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “రాట్సాసన్”. దీనినే తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “రాక్షసుడు” గా తీసి తన కెరీర్ లో బెస్ట్ హిట్ గా కూడా మలచుకున్నాడు.

మరి ఈ చిత్రంమే ఇపుడు బాలీవుడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని అక్కడ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేయనున్నట్టు తెలుస్తుంది.అలాగే ఈ చిత్రానికి “మిషన్ సిండ్రెల్లా” అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారట. అక్షయ్ ఎన్నో రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం మరిన్ని భారీ చిత్రాలు కూడా అక్షయ్ చేస్తున్నాడు. మరి ఈ క్రేజీ రీమేక్ కూడా ఉందా లేదా అన్న దానిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :