మహేష్ కు సీతగా ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.?

Published on Mar 30, 2021 10:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ మార్కెట్ లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు కానీ మహేష్ మాత్రం ఎప్పుడో తనకి ఆ ఆలోచనలు లేవని చెప్పేసారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారుతుండడంతో తన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కూడా పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా దర్శక ధీరుడు రాజమౌళితో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమా కాకుండా మహేష్ తో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మధు మంటేనా రామాయణం 3డి లో ప్లాన్ చెయ్యాలని చూసిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో టాక్ లో ఉన్న ఈ చిత్రంలో మహేష్ రాముని పాత్రలో నటించనున్నాడు.

మరి ఇప్పుడు సీతగా అక్కడి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పేరు రేస్ లోకి వచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో గాసిప్స్ బయటకొచ్చాయి. అయితే మహేష్ కు ఆల్రెడీ స్క్రిప్ట్ ఓకే అయినా తాను ఇంకా ఎలాంటి అంగీకారం చెప్పలేదని తెలుస్తుంది. ఒకవేళ మహేష్ కనుక ఓకే చెప్తే ఈ చిత్రం సెట్స్ లోకి వెళ్లడం ఖాయం అని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :