‘బిగ్ బాస్ 5’..ఈసారి మొట్టమొదటి ఫైనలిస్ట్ గా అతను తగినవాడేనా?

‘బిగ్ బాస్ 5’..ఈసారి మొట్టమొదటి ఫైనలిస్ట్ గా అతను తగినవాడేనా?

Published on Dec 4, 2021 8:01 AM IST


మన తెలుగు బుల్లితెర పై గ్రాండ్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఐదవ సీజన్లోకి వచ్చి ఫైనల్స్ కి అతి చేరువలో ఉంది. మంచి రసవత్తరంగా మారుతున్న పరిస్థితులతో బిగ్ బాస్ షో ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. మరి ఈ క్రమంలో ఈ సారి సీజన్లో మొట్టమొదటి కంటెస్టెంట్ ఎవరో అనేది కూడా నిన్న తేలిపోయింది.

అయితే ఈ సారి కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర మొట్టమొదటి ఫైనలిస్ట్ గా ఎంపికయ్యి హాట్ టాపిక్ గా మారాడు. మరి అలాగే ఇక్కడే ఇంకో ఆసక్తికర ప్రశ్న వస్తుంది. మొదటి ఫైనలిస్ట్ కంటెస్టెంట్ గా శ్రీరామ చంద్ర ఎంతవరకు తగినవాడు అని. అయితే దీనికి మాత్రం నో డౌట్ గా అతడు తగినవాడే అని సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది.

మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే జెనరల్ ఫాలోవర్స్ గా సపోర్ట్ అందుకుంది శ్రీరామ చంద్రనే.. అక్కడ నుంచి తన గేమ్ లో నిలకడగా ఉన్నాడు కాబట్టే మొదటి ఫైనలిస్ట్ గా ఇప్పుడు నిలబడిగలిగాడు. దీనితో ఇప్పుడు అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో అనేది కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు