ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు కోలీవుడ్ స్టార్ అండ్ యంగ్ దర్శకుడు అట్లీతో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్ ట్రీట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఓ క్రేజీ సీక్వెన్స్ ఇపుడు అట్లీ ప్లాన్ చేస్తున్నాడట. దీని ప్రకారం అండర్ వాటర్ లో ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ని అట్లీ ఇపుడు బన్నీపై తీస్తున్నాడట.
మరి ఈ సీక్వెన్స్ కోసం భారీ ఖర్చు అండ్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తెచ్చి తెరకెక్కిస్తున్నారట. ఇది వరకే ఈ సినిమా పోస్టర్స్ లో నీటితో కూడిన పరిస్థితులు కూడా చూపించారు. సో ఒక హైలైట్ ఎలిమెంట్స్ లో ఈ ఎపిసోడ్ కూడా ఒకటిగా ఉండొచ్చు. ఇక ఈ భారీ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.


