బన్నీ సెన్సేషన్ కు వెల్డన్ చెబుతున్న డాషింగ్ బ్యాట్సమెన్.!

Published on Nov 24, 2020 9:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురంలో” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యి సెన్సేషన్ ను నమోదు చేసింది. బాక్సాఫీస్ పరంగా దుమ్ము లేపిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా అంతే సంచలనాన్ని నమోదు చేసుకుంది.

థమన్ ఆందించిన పాటల్లో బుట్ట బొమ్మ అయితే ఇంటెర్నేషల్ వైడ్ అటెన్సన్ ను రప్పించుకుంది. అలా ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్సమెన్ అయినటువంటి డేవిడ్ వార్నర్ కూడా ఈ సాంగ్ కు స్టెప్పేయడం ఆ టైం లో మంచి హాట్ టాపిక్ అయ్యింది. ఇక అక్కడ నుంచి గత ఐపీఎల్ వరకు కూడా వార్నర్ మళ్ళీ పలు మార్లు స్టెప్పేయడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సాంగ్ మరో మైల్ స్టోన్ 450 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా డేవిడ్ వార్నర్ బన్నీకు తన ఇన్స్టా ద్వారా వెల్డన్ అంటూ స్టేటస్ పెట్టారు. దీనితో ఈ ఇద్దరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో చేస్తున్న “పుష్ప”లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More