“రాధే శ్యామ్”లో ఈ అంశం చాలా స్పెషల్.?

“రాధే శ్యామ్”లో ఈ అంశం చాలా స్పెషల్.?

Published on Dec 13, 2020 1:00 PM IST

Radhe Shyam 3

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ లవ్ స్టోరీ చిత్రం “రాధే శ్యామ్”. ఇటీవలే కాలంలో మంచి హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు ఇండియా వైడ్ ఉన్నాయి.

అయితే ఈ చిత్రంలో ఒక్క యాక్షన్ పార్ట్ ను మినహాయిస్తే అన్ని హంగులను అత్యద్భుతంగా జోడించారు. అయితే ఈ చిత్రంలో ఎప్పటి నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన అంశం ఈ చిత్రం నుంచి ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ అనే చెప్పాలి. చాలా కాలం పాటు చాలా గోప్యంగా ఉంచిన ఈ అంశమే ఈ చిత్రానికి స్పెషల్ గా నిలవనుంది అని తెలుస్తుంది.

ఈ సినిమాకు తీసుకున్న జస్టిన్ ప్రభాకరన్ చాలా మంచి అవుట్ ఫుట్ ను ప్లాన్ చేసిన అన్ని భాషల్లో ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం మోషన్ పోస్టర్ లో ఇచ్చిన మెస్మరైజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి అందుకు తగ్గట్టుగానే జస్టిన్ ఈ చిత్రాన్ని తన సంగీతంతో మరింత స్పెషల్ గా మలుస్తున్నాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు