కంగనా ‘తలైవి’లో ఇంట్రస్టింగ్ అంశం !

Thalaivi 1

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ జయలలిత జీవితం ఆధారంగా రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ బయోపిక్ లో ఓ అంశం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబు – జయలలిత మధ్య చక్కటి అనుబంధం ఉందని అప్పట్లో బాగా రూమర్స్ వచ్చాయి. అయితే వారి మధ్య నిజంగానే బంధం ఉందా.. అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.

Exit mobile version