పవన్ క్రేజీ ప్రాజెక్ట్ కి ఈ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్.?

Published on Aug 26, 2021 10:03 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటి తర్వాత కూడా తన కెరీర్ లో ఎప్పుడు లేని లైనప్ తో సన్నద్ద్ధం అవుతున్నాడు. మరి వాటిలో తన ఆల్ టైం క్రేజీ కాంబో హరీష్ శంకర్ తో కాంబో కూడా ఒకటి. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో వీరికి సెపరేట్ బెంచ్ మార్క్ సెట్టయ్యింది. దీనితో వీరి నుంచి రెండో ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యగానే భారీ హైప్ నెలకొంది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ బజ్ గా నడుస్తుంది. మరి ఈ టాక్ ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్ సహా పాన్ ఇండియన్ సినిమాలుకు ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్న హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానున్న రోజుల్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :