స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొదట నార్మల్ గానే స్టార్ట్ చేసినా తర్వాత పాన్ ఇండియన్ ఫ్లిక్ గా అనౌన్స్ చేసిన ఈ చిత్రం కోసం బన్నీ సహా బాలీవుడ్ వర్గాలు కూడ ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ కూడా మిగతా చిత్రాలతో పాటుగా తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టనుంది.
అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించి ఒక లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ను ఒక హీరోతో చేయించనున్నారని తెలిసింది. అయితే ఆ రోల్ కు మన టాలీవుడ్ లోని అండర్ రేటెడ్ అండ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ పేరే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో విడుదల చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
