నాని ‘వి’లో ఆ హీరోయిన్ విలన్ అట ?

Published on Apr 7, 2020 10:00 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నేచురల్ స్టార్ నాని విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి కూడా నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. మరి నానికి జోడిగా నటిస్తోందా లేక ఆమెది సెపెరేట్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు. అలాగే సుధీర్‌బాబుతో స‌మ్మోహ‌నం వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు.

ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు మొత్తం సినిమాలోనే ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రానుంది.

సంబంధిత సమాచారం :

X
More