కరోనా నుంచి బయటపడ్డ ప్రముఖ బాలీవుడ్ నటుడు.!

కరోనా నుంచి బయటపడ్డ ప్రముఖ బాలీవుడ్ నటుడు.!

Published on May 27, 2020 10:01 PM IST

ఇటీవలే కరోనా వైరస్ మూలాన బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ అదే బాలీవుడ్ కు చెందిన మరో వెర్సిటైల్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

దానితో అదే సమయంలో ఆయనను కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో కూడా ఉంచారు. అయితే ఇప్పుడు ఓ శుభవార్త వచ్చింది. ఆయనకు ఇప్పుడు మళ్ళీ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినట్టు తేలింది. దీనితో ఆయన కరోనా బారి నుంచి తప్పించుకున్నట్టయ్యింది. కిరణ్ కుమార్ తన సినిమా కెరీర్ లో ఎన్నో 500 కు పైగా చిత్రాల్లో నటించి ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు