తారక్ రేడియేషన్ కాంబో కోసం ఈ హాట్ బ్యూటీ.?

Published on Jun 20, 2021 11:39 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదే సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్న తారక్ దీని తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సినిమాలతో కూడా కొనసాగించనున్నాడు.

అయితే ఆ రెండిట్లో ఎనలేని అంచనాలు ప్రశాంత్ నీల్ తో చేయనున్న పవర్ ఫుల్ ప్రాజెక్ట్ పై ఉన్నాయి. రేడియేషన్ సూట్ అంటూ సాలిడ్ బ్యాక్ డ్రాప్ పై టీజ్ చేస్తున్న మేకర్స్ ఈ సినిమాకు హీరోయిన్ గా ఎవరి సెట్ చేయనున్నారో బజ్ వినిపిస్తుంది. మరి ఆ టాక్ ప్రకారం ఈ చిత్రంలో యంగ్ టైగర్ సరసన యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుందట. అయితే ఇంకా ఆమె పేరు ఫిక్స్ కాలేదు కానీ మేకర్స్ ఆమె అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత మేర నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :