“RRR” పోస్టర్ కి పవన్ కి అలా లింక్ అయ్యిందట..!

Published on Jun 30, 2021 10:01 am IST

ప్రస్తుతం ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న మరో చిత్రం “RRR”. మెగాపవర్ స్టార్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ లేటెస్ట్ చిత్రం నుంచి నిన్న ఒక ప్లెజెంట్ పోస్టర్ తో పాటు ఒక అధికారిక అప్డేట్ సహా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు. మరి తారక్ మరియు చరణ్ లు ఉన్న ఈ పోస్టర్ మాత్రం ఒక లెక్కలో వైరల్ అయ్యింది.

ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్నో ఎడిట్స్ చేసుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ డీటెయిల్ తెలిసింది. నిన్న “RRR” టీం విడుదల చేసిన పోస్టర్ లో తారక్ నడుపుతున్న పాత కాలపు బుల్లెట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ పవన్ నటించిన హిట్ చిత్రం “జల్సా” సినిమాలో ఓ పాటలో పవన్ వాడేసాడని ఫోటో బయటకి వచ్చింది.

రెండు ఫోటోస్ చూస్తే సేమ్ రెండూ కూడా ఒకటే డిజైన్ కూడా ఎక్కడా కూడా చిన్న చేంజ్ లేదు.. దీనితో ఇలా కాస్త డిఫరెంట్ గా పవన్ కి “RRR” కి లింకప్ అయ్యింది.. మరి ప్రస్తుతం పవన్ కూడా ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :