రానా-మిహికాల ప్రేమ ఆమె వలన.. అలా మొదలైందట.

Published on May 23, 2020 10:25 am IST

బంధువుల సమక్షంలో ప్రేమ జంట రానా, మిహిక రోకా వేడుకగా వైభవంగా జరుపుకున్నారు. త్వరలోనే వీరి వివాహ నిశ్చితార్ధం మరియు పెళ్లి జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక ఘనంగా పెళ్లి నిర్వహించాలని పెద్దలు భావిస్తున్నారు. ఐతే అసలు, రానా మిహికల బంధం ఎలాకుదిరింది. వీరి పరిచయం వెనుక ఎవరు ఉన్నారు అనే అనేక అనుమానాలు అందరిలో నెలకొని ఉన్నాయి.

ఐతే వీరి పరిచయం వెనుక రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది. అశ్రిత మరియు మిహిక క్లాస్ మేట్స్ కావడంతో ఆమె ద్వారా రానాకు మహిక పరిచయం అయ్యిందట. ఐతే ఇది లవ్ యట్ ఫస్ట్ సైట్ కాదట. చాలా కాలం వీరి మధ్య స్నేహం ఉండగా ఈ ప్రయాణంలో ఒకరిపై మరొకరికి ప్రేమ కలిగిందట. ఇక ఈ విషయాన్ని మొదటగా రానా ఆమెకు తెలియజేయగా మిహిక ఎస్ చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి మిహిక మరియు రానా కలయిక వెనుక రానా చెల్లెలు ఆశ్రిత ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More