‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!

‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!

Published on Aug 5, 2026 3:09 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న అతి కొద్ది చిత్రాల్లో బాలీవుడ్ సినిమా తెరకెక్కిస్తున్న సినిమా ‘రామాయణ’ కూడా ఒకటి. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ల కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. అయితే ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ లో రాకింగ్ స్టార్ యష్ రావణ్ మహారాజ్ గా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి హాట్ టాపిక్ గా మారాడు.

అయితే అసలు రామాయణ అనే భారీ ప్రాజెక్ట్ లోకి యష్ ఎలా ఎంటర్ అయ్యాడు అనేది తెలుస్తుంది. పలు బాలీవుడ్ కథనాల ప్రకారం యష్ అసలు నిర్మాతగా కానీ నటుడిగా కానీ ఈ ప్రాజెక్ట్ కోసం అనుకుంటున్నపుడు భాగం కాదట. ముందుగా నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణం చిత్రాన్ని అత్యంత భారీగా తీయాలి అనే సమయంలో లాస్ ఏంజెల్స్ లో ఉన్నపుడు దాదాపు ఐదేళ్ల కితమే యష్ నటించిన కేజీయఫ్ చాప్టర్ 2 చూసి తన రామాయణంలో రావణ పాత్రకి యష్ సరిగా సరిపోతాడని భావించారట.

అప్పటికి యష్ ని తాను కలిసింది కూడా లేదట. ఆ తర్వాత కలిసినపుడు తన విజన్ ని చెప్పడంతో యష్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగం అయ్యేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తుంది. సో ఇలా యష్ రామాయణ లోకి ఎంటర్ అయ్యాడట. ఇక ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, రెహమాన్ లు సంగీతం అందిస్తుండగా ఈ ఏడాది దీపావళి కానుకగా సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు