బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ అలా ఉపయోగిస్తాడట…!

Published on Nov 7, 2019 10:45 pm IST

ఆసక్తిగొలిపే ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ నిలిచాడు. 17మంది సభ్యులతో 100రోజులకు పైగా నడిచిన ఈరియాలిటీ షోలో టాప్ ఫైవ్ కి రాహుల్, శ్రీముఖి,బాబా భాస్కర్, అలీ రెజా వెళ్లడం జరిగింది. వీరిలో ఫైనలిస్టులు గా రాహుల్, శ్రీముఖి నిలువగా వీరిద్దరిలో విజేతగా ప్రజల ఓట్ల ఆధారంగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. దీనితో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున టైటిల్ విన్నర్ ని ప్రకటించగా, ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ టైటిల్ మరియు ప్రైజ్ మనీ రాహుల్ కి అందించడం జరిగింది.

బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ 50లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా గెలుపొందాడు. మరి ఈ మొత్తాన్ని ఏమి చేస్తావు అని రాహుల్ ని అడుగగా తన తల్లిదండ్రుల కొరకు ఒక ఇల్లు కట్టించగా మిగిలిన డబ్బులతో హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో బార్బర్ షాప్స్ ఓపెన్స్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. రాహుల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తరువాత సెలెబ్రిటీ ఐపోయాడు. ఆయనకు ఇప్పుడు సింగర్ గా కూడా విరివిగా అవకాశాలు వచ్చే ఆస్కారం కలదు.

సంబంధిత సమాచారం :

X
More