ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ కలిసే సందర్భం అదే..?

Published on Mar 2, 2020 8:04 am IST

రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ జనవరి 8, 2021లో విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కాగా ఈ చిత్రంలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ కలుస్తారా లేదా అనే అనుమానం ప్రేక్షకులలో ఉంది. ఎందుకంటే చరిత్ర పరంగా భిన్న ప్రాంతాలు నేపధ్యాలు కలిగిన భీమ్, అల్లూరి కలిసిన దాఖలాలు లేవు.

ఐతే వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ఆర్ ఆర్ ఆర్ లో ఉన్నట్లు ఈ మధ్య ఓ లీక్ బయటికి వచ్చింది.కాగా వీరిద్దరూ కలవడానికి ఒక పాయింట్ ఉంది. అల్లూరి, కొమురం భీమ్ కొన్నాళ్లు ఎవరికీ కనిపించలేదట. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని రాజమౌళి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ సీన్స్ వస్తే వీరిద్దరూ కనిపించకుండా పోయిన రోజులలో అనుకోకుండా కలిసినట్లు రాజమౌళి చూపించే ఆస్కారం ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్ చరణ్ , ఎన్టీఆర్ ముఖా ముఖి పోరుకు తెగబడతారు అని కూడా వినిపిస్తుంది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More