“ఆచార్య” లో ఇంకా బ్యాలన్స్ ఇవేనా?

“ఆచార్య” లో ఇంకా బ్యాలన్స్ ఇవేనా?

Published on May 26, 2020 8:02 PM IST

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “ఆచార్య”. మెగాస్టార్ ఛరిష్మాకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని కూడా తెలిసిందే.

ఇప్పటికే చాలా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుకుంది. ఇటీవలే మన తెలుగు చిత్రాల షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మన తెలుగు నుంచి మొదట షూటింగ్ లో పాల్గొనే భారీ చిత్రాల్లో ఆచార్య కూడా ఉంది. ఈ చిత్రానికి ఇంకా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ సహా రెండు పాటలు బాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మిగతా షూట్ వచ్చే జూన్ మూడవ వారం నుంచి మొదలు కాబోతున్నట్టు వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు