నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..వారసుడు వస్తాడట.

Published on Jun 5, 2020 7:29 am IST

నందమూరి నటవారసుడు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞకి సినిమాపై ఆసక్తి లేదని ప్రచారం జరుగుతుండగా.పాతికేళ్ళు దాటినా ఆయన ఇంకా వెండి తెరకు పరిచయం కాకపోవడం అది నిజమే అనే అనుమానాలు లేవనెత్తుతుంది. ఇక బాలయ్య తాజా ఇంటర్వ్యూలో కూడా దీనిపై స్పందించారు.మోక్షజ్ఞ హీరో ఎప్పుడు అవుతారు అంటే ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. దేవతలు ఆశీర్వదించిన రోజున అది జరుగుతుంది అన్నారు. అలాగే సినిమాపై మోక్షజ్ఞకు ఆసక్తి ఉందని, మంచి మూడ్ చూసి లాంచ్ చేయడమే అన్నారు. కాబట్టి కొంచెం లేటైనా మోక్షజ్ఞ సినిమాలలోకి రావడం ఖాయం అని తెలుస్తుంది.

ఇక మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకులు సిద్ధంగా ఉన్నారు. మరో ప్రక్క బాలయ్య ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంత మందిని ఎదురుచూసేలా చేస్తున్న మోక్షజ్ఞకు సినిమా పై మనసు మళ్లాలని, ఆయన త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

More