“ఫ్యామిలీ మ్యాన్ 2” ఈ సడెన్ నిర్ణయంకి కారణం ఇదే.?

Published on Jun 1, 2021 5:08 pm IST

ప్రస్తుతం ఇండియన్ ఎంటర్టైన్మెంట్ వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ లలో “ది ఫ్యామిలీ మ్యాన్” సీజన్ 2 కూడా ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంకొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్న ఈ క్రేజీ థ్రిల్లర్ సిరీస్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు కితమే విడుదల చేసిన టీజర్ కు భారీ స్థాయి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఆ ట్రైలర్ వచ్చినంత వరకు ఒక్క సమంతా సహా దర్శకులు మొత్తం ఆ కొన్ని రోజులు సాలిడ్ ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో అదరగొట్టేసారు. అయితే దాని తర్వాత మాత్రం మేకర్స్ సహా సామ్ కూడా స్లో డౌన్ అయ్యిపోయింది. మరి దీనికి కారణం మళ్ళీ కాంట్రవర్సీ ఏమన్నా రేగుతుందేమో అనే కారణం మూలాన అన్నట్టు తెలుస్తుంది.

ట్రైలర్ వచ్చాక తమిళ ఆడియెన్స్ మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని ఒక రేంజ్ లో రచ్చ నడిచింది. దీనితో అక్కడ నుంచి మళ్ళీ పెద్దగా అసలు ప్రమోషనల్ ట్వీట్స్ స్టార్ క్యాస్ట్ నుంచి కనిపించలేదు. మరి ఈ కారణంగానే ఈ సిరీస్ మేకర్స్ సడెన్ సైలెంట్ అయ్యారని సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుతానికి అయితే ఇంకా మూడు రోజులే సమయం ఉంది మరి ఈ గ్యాప్ లో ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :