ఈ సీక్వెన్సెస్ పై దృష్టి పెట్టనున్న జక్కన్న?

Published on Jun 3, 2020 8:13 pm IST


ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రాంచరమ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న చిత్రం మన దేశంలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రంగా నిలిచింది.

అయితే ఈ కరోనా కాస్త కాలంలో అన్ని చిత్రాల షూటింగ్ నిలిచిపోయినట్టుగానే ఈ చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడింది. అందుకే మళ్ళీ షూటింగ్స్ మొదలయిన తర్వాత పక్కా ప్లానింగ్ ప్రకారం షూటింగ్ చెయ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

అందులో భాగంగా మొదట మిగిలి ఉన్న కీలక యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూటింగ్స్ ను కూడా కేవలం పరిమిత సిబ్బందితోనే తెరకెక్కించనున్నారట.

సంబంధిత సమాచారం :

More