ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కే వి తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం ‘ఫంకీ'(Funky) కూడా ఒకటి. డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
అయితే అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది రివీల్ అయ్యింది. అనుదీప్ హిట్ చిత్రం జాతి రత్నాలు లో చిన్న కేక్ ముక్క కోసం ఎలా అయితే చిన్న కాంఫ్లిక్ట్ ఉంటుందో ఇందులో కూడా చిన్న కాంఫ్లిక్ట్ ఉన్నట్టు నిర్మాత నాగవంశీ రివీల్ చేశారు. ఇందులో ఒక దర్శకునికి, నిర్మాతకి మధ్య 100 రూపాయల వల్ల వచ్చే ఛాలెంజ్ ఉంటుందని, కేవలం 100 రూపాయలతో సినిమా తీయడంపై కథనం ఉంటుంది అన్నట్టు తెలిపారు.
సో సినిమా ప్రధాన కథ ఏంటి అనేది ఇదే అని చెప్పొచ్చు. మరి రేపు థియేటర్స్ లో ఫన్ దీనిపై ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.


