పవన్ – క్రిష్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Mar 1, 2020 11:06 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంలోనూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాలలోని కొన్ని ఎపిసోడ్స్ షూట్ లో కూడా పవన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవ్వనుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ షూట్‌ చేయనున్నారు.

కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సినిమా టైటిల్ ఇదేనంటూ బజ్ వినబడుతోంది. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More