“కేజీయఫ్ 2” కి డబ్బింగ్ స్టార్ట్ చేసిన కీలక నటి.!

Published on Jun 16, 2021 10:02 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం భారతీయ సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వస్తే మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అని చెప్పాలి.

అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర న్యూస్ చీఫ్ ఎడిటర్ దీప రోల్ చేసిన సీనియర్ నటి మాళవిక తన డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఫస్ట్ పార్ట్ లో ఎంత పవర్ ఫుల్ ఆమే రోల్ ఉందో చూసాము. మరి రెండో పార్ట్ లో ఎలా ఉండనుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ సహా రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించగా హోంబలే పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :