ఈ కోలీవుడ్ సెన్సేషనల్ కాంబో మళ్ళీ రిపీట్ కానుందా.?

Published on Feb 25, 2021 11:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నట్టుగానే ఒక స్టార్ హీరో మరో స్టార్ దర్శకుడు కాంబోలు లానే కోలీవుడ్ లో కూడా కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. మరి వాటిలో ఇళయ థలపతి విజయ్ మరియు టాలెంటెడ్ దర్శకుడు అట్లీ ల కాంబో కూడా ఒకటి. అయితే వీరి కాంబో నుంచి వచ్చిన గత మూడు సినిమాలు కూడా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేసాయి.

అలాగే ఈ కాంబో వలనే విజయ్ కు కూడా మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మళ్ళీ రిపీట్ కానున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన బిగిల్, మరియు మెర్సల్ సినిమాలు భారీ హిట్స్ అండ్ భారీ స్థాయి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇంకో సినిమా అంటే తారా స్థాయి అంచనాలు కన్ఫర్మ్..మరి ఈ ఈసారి ఎలాంటి సబ్జెక్టు తో వీరు పలకరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :