ఈ కోలీవుడ్ స్టార్ కమెడియన్ కు తీవ్ర అస్వస్థత.!

Published on Apr 16, 2021 4:00 pm IST

భాషతో సంబంధం లేకుండా పలువురు నటులు అన్ని భాషలకు కూడా సుపరిచితమే అలా మన దక్షిణాదిలో ఉన్న నటుల్లో కోలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్ కమెడియన్ వివేక్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా అలరించిన ఈ నటుడు తీవ్ర అస్వస్థతకు లోను అయ్యారన్న వార్త బయటకు రావడం బాధాకరం.

మరి అసలు విషయం లోకి వెళ్తే ఈరోజు ఉదయమే వివేక్ కు గుండె నొప్పి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే అది కాస్త సీరియస్ అన్నట్టే బయటకు వచ్చింది. 59 ఏళ్ల వివేక్ ఇప్పుడు చెన్నై సిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్క వివేక్ ఇటీవలే తన కరోనా వాక్సిన్ ను కూడా తీసుకున్నారని తెలిసింది. మళ్ళీ ఇంతలోనే ఇలా జరగడం కాస్త విచారకరం. మరి వివేక్ తొందరగా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :