రాహుల్ టికెట్ ఫినాలే దక్కించుకొని ప్రశాంతంగా మిగతా కంటెస్టెంట్స్ పడుతున్న ఆపసోపాలు ఎంజాయ్ చేస్తుండగా, ఆ ఐదుగురు మాత్రం ఎలాగైనా ఫైనల్ కి అర్హత సాధించాలని శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. షో కీలకమైన చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ కఠినమైన టాస్కులతో కంటెస్టెంట్స్ కి పరీక్ష పెడుతున్నాడు. లేడీ కంటెస్టెంట్స్ అయిన శ్రీముఖిని చేప నోట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలని చెప్పిన బిగ్ బాస్, శివజ్యోతి తో గుడ్డు కలిపిన పాలు తాగాలని ఆదేశించాడు. ఇక పురుష కంటెస్టెంట్స్ అలీ,బాబా భాస్కర్, వరుణ్ లకు కొంచెం కష్టమైన ఫిజికల్ టాస్క్లు ఇచ్చారు.
కాగా హౌస్ లో ఉన్న ఆరుగురు సభ్యులలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఒకరు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. ఎటూ రాహుల్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. కావున మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. కాగా శివజ్యోతి మిగిలిన సభ్యులకంటే తక్కువ ఓట్లు సంపాదించి ఎలిమినేషన్ కి దగ్గరైందని సమాచారం. మిగిలిన నలుగురితో పోల్చుకుంటే శివ జ్యోతి వీక్ కంటెస్టెంట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. చాలా మంది అభిప్రాయం ప్రకారం టాప్ ఫైవ్ నుండి శివ జ్యోతి అవుట్ అని తెలుస్తుంది.


