మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఇక దర్శకుడు బాబీ కొల్లి – చిరు కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట తమిళ హీరో కార్తీ పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఇది చిరంజీవి కెరీర్లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2026 లో ప్రారంభం కానుంది.
