ఫేక్ అకౌంట్ పై జాగ్రత్త చెబుతున్న మెగా హీరో.!

Published on Mar 21, 2021 10:24 pm IST

పలువురు సినీ తరాలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయని లేదా వారి పేరిట కొంతమంది వాటిని వినియోగిస్తున్నారని మనం ఇది వరకే చాలా వార్తలు విని ఉంటాం. మరి అలాగే లేటెస్ట్ మెగా హీరో తన ఫాలోవర్స్ కి తన సోషల్ మీడియా ఖాతా కోసం అలెర్ట్ చేస్తున్నాడు.

మన టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే ఏ డెబ్యూ హీరో సినిమాకి రాణి వసూళ్లను మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రాబట్టుకున్నాడు. దీనితో ఆ రికార్డును సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఫేమ్ అక్కడ నుంచి సోషల్ మీడియాలో కూడా ఎక్కువయ్యింది. దీనితో అతని పేరిట ట్విట్టర్ లో ఓ ఫేక్ అకౌంట్ దర్శనం ఇచ్చింది.

ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ మెగా ఫ్యాన్స్ లో మంచి హంగామా నడిపిన ఆ ట్విట్టర్ హ్యాండిల్ నాది కాదు అని ఈ మెగా హీరో కుండ బద్దలు కొట్టాడు. అంతే కాకుండా తనకి ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదు.. దానిని ఎవరూ నమ్మొద్దని ఆ అకౌంట్ కి రిపోర్ట్ చేసి దానికి దూరంగా ఉండాలని ఓ అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలిపాడు.

సంబంధిత సమాచారం :