“కేజీయఫ్ 2” లో ఈ మైండ్ బ్లాకింగ్ సీన్ కూడా.?

Published on Feb 26, 2021 10:00 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అలాగే ప్రశాంత్ నీల్ లా కాంబోలో వస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం అంతలా ప్రేక్షకులు ఎందుకు ఎదురు చూస్తున్నారో కూడా తెలిసిందే.

కంటెంట్ తో కూడిన మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లు కోసమే ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక మైండ్ బ్లాకింగ్ సీన్ ఉందని ఓ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందంట. అయితే ఈ సీన్ ఎప్పుడో తెరకెక్కినా ఇప్పుడు సడెన్ గా వైరల్ అవుతుంది.

అయితే ఈ సీన్ సినిమాలో అదిరిపోయే లెవెల్లో ఉంటుందట. మరి ఈ సీన్ లో యష్ తో పాటు ఎవరికి మధ్యలో ఉంటుందో కానీ సినిమాలో మాత్రం విజువల్ ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి అలాగే ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 16న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :