కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తమిళ్ సహా తెలుగులో గ్రాండ్ గా రేపు విడుదల కానున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ వరల్డ్ వైడ్ గా గట్టి టార్గెట్ నే పెట్టుకొని థియేటర్స్ లో విడుదల అవుతున్నట్టు ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఈ చిత్రం తెలుగు స్టేట్స్ సహా తమిళనాడు నుంచే మొత్తం 60 కోట్లకి పైగా థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక మిగతా మార్కెట్ లలో కలిపి ఇంకో 30 కోట్లతో టోటల్ గా 90 కోట్ల టార్గెట్ తో సినిమా రాబోతుందట. సో ఓవరాల్ గా ఈ సినిమా కరుప్పు తో పోలిస్తే 200 కోట్ల గ్రాస్ వరకు రాబడితే గాని గట్టెక్కదు. సో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ టార్గెట్ ని అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.


