చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ లో ఈ ప్రముఖ నటుడు.?

Published on Aug 25, 2021 2:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ తీస్తున్న సంగతి తెలిసిందే. దీనితో తర్వాత మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి భారీ హైప్ తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ సహా క్యాస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా శంకర్ పలువురు ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరి అలా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ చిత్రాల్లో నటించిన జైరామ్ ఈ చిత్రానికి కూడా వర్క్ చేయనున్నారని నయా టాక్. మరి తెలుగులో భాగమతి, అల వైకుంఠపురములో లాంటి మంచి హిట్స్ లో కనిపించిన ఈయన ఈ చిత్రంలో ఎలాంటి రోల్ లో కనిపించనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :