డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “సలార్”?

Published on Sep 13, 2023 7:02 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి 2898 AD, స్పిరిట్ వంటి భారీ చిత్రాలతో పాటు, దర్శకుడు మారుతీతో ఒక చిత్రం నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ప్రాజెక్ట్ సలార్ వాయిదా పడింది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి.

ఈ యాక్షన్ డ్రామా గురించి సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే దీని గురించి మేకర్స్ నుండి ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :