వైరల్ అవుతోన్న ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఫోటో !

Published on Apr 14, 2019 8:50 pm IST

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

కాగా ఈ రోజు సాహో నుండి ఒక ఫోటో లీకయింది. ఆ ఫోటోలో శ్రద్ధా కపూర్ – ప్రభాస్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు మంచి రొమాంటిక్ మూడ్ లో చూసుకుంటూ ఉన్నారు.

దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం :