“గాడ్ ఫాథర్” ని హిందీలో రిలీజ్ చేసేది ఎవరంటే.!

“గాడ్ ఫాథర్” ని హిందీలో రిలీజ్ చేసేది ఎవరంటే.!

Published on Sep 17, 2022 2:32 AM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నా ఈ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం రిలీజ్ కి దగ్గర అవుతుండగా మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని తెలుగు సహా హిందీలో కూడా రిలీజ్ కి ప్లాన్ చేసినట్టు అనౌన్స్ చేశారు. మరి దీనిపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

అయితే ఈ చిత్రాన్ని హిందీలో సూపర్ క్లస్టర్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మొత్తానికి అయితే ఈ అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో నయన్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందిస్తున్నారు అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు