‘ఖైదీ’ సీక్వెల్ కంటే ముందు కార్తీ మరో క్రేజీ సీక్వెల్..?

Karthi

తమిళ దర్శకుడు హెచ్. వినోద్ ‘జన నాయగన్’ చిత్రం తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు సమాచారం. కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని హీరో కార్తీతో చేయబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఖాకీ’ చిత్రానికి సీక్వెల్ కి సీక్వెల్ అని తెలుస్తోంది. ‘ఖాకీ’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇప్పటికీ కార్తీ కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

మరోవైపు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ 2’ చిత్రాన్ని అల్లు అర్జున్‌తో తన సినిమా పూర్తయిన తర్వాతే ప్రారంభిస్తానని ఇప్పటికే హింట్ ఇచ్చాడు. లోకేష్ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో, ఈ గ్యాప్‌లో కార్తీ ‘ఖాకీ 2’ను పూర్తి చేసే వీలుంది. ఈ క్రమంలో రెండు భారీ సీక్వెల్స్ ఒకదాని తర్వాత ఒకటి రావడం కార్తీ కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

ప్రస్తుతం కార్తీకి బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ హిట్ అవసరం ఉంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆయన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. హెచ్. వినోద్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ తీయడంలో దిట్ట కాబట్టి, ‘ఖాకీ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుపై మరిన్ని స్పష్టమైన వివరాలు వెలువడనున్నాయి.

Exit mobile version