పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి కాంబినేషన్లో చేస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి అంచనాలు ఏమాత్రం తీసి పోకుండా దర్శకుడు ప్రభాస్ ని ప్రెజెంట్ చేస్తుండగా తనతో క్రేజీ ప్రయోగాలు కూడా చేయడం జరిగింది.
ఇలా లేటెస్ట్ గా మారుతి ఓ క్రేజీ సీక్వెన్స్ ఇందులో ఉందని అది మాత్రం ఇండియన్ సినిమా స్క్రీన్ దగ్గర ఇప్పుడు వరకు రాలేదని తను అంటున్నారు. ప్రభాస్ లుక్ తనలోని స్వాగ్ ఇంకా స్టైల్ ని కూడా కరెక్ట్ గా అందులో వినియోగించినట్టు తెలిపారు. అంతేకాకుండా ఈ సీక్వెన్స్ చూసి ఎంజాయ్ చేస్తేనే దాని ఫీల్ తెలుస్తోంది అని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారు పాత్ర చాలా ఏళ్ళ పాటు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది అని తను చెబుతున్నారు.


