“అఖండ” లో ఈ షూట్ మాత్రమే బ్యాలన్స్.?

Published on May 16, 2021 9:09 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కృష్ణ హీరోగా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను మరియు బాలయ్యల కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై ఆల్రెడీ భారీ అంచనాలు కూడా సెట్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఇటీవలే హీరోయిన్ ప్రగ్యా పలు ఆసక్తికర విషయాలనే వెల్లడించింది.

వాటిలో భాగంగానే ఇంకా ఒక 20 రోజుల మేర షూట్ బ్యాలన్స్ ఉందని తెలిసింది. మరి తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో ఒక్క క్లైమాక్స్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అది కూడా బోయపాటి ఓ రేంజ్ లో ఈ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.మరి ఈ సాలిడ్ క్లైమాక్స్ ఎలా ఉండనుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :