ఆ పాటతో లెజెండ్స్ ని గుర్తు చేశారుగా

ఆ పాటతో లెజెండ్స్ ని గుర్తు చేశారుగా

Published on Sep 18, 2019 8:20 AM IST

వాల్మీకి చిత్రం ఇంకా రెండు రోజులలో ధియేటర్లలో దిగనుంది. వరుణ్ నయా అవతారంలో నటవిశ్వరూపం చూపించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే ఈ చిత్రం కోసం దేవత చిత్రంలోని వెల్లువచ్చి గోదారమ్మ… సాంగ్ ని రీమిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈసాంగ్ సంచలనంగా మారడంతో పాటు, యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ని మరో మారు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చేరువచేసి లెజెండరీ నటులైన నటవిభూషణ్ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేశారు. పాత పాటకు అనవసరపు మార్పులు చేర్పులు చేయకుండా, ఒరిజినల్ సాంగ్ కి దగ్గరా కంపోజ్ చేసినతీరు బాగా ఆకట్టుకుంది. వరుణ్, పూజా స్టెప్స్ విషయంలో కూడా శోభన్ బాబు, శ్రీదేవిలను అనుకరించడం గమనార్హం. 1982లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించండి. జయప్రద ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు