యంగ్ టైగర్ లైనప్ లో మళ్ళీ ఈ స్టార్ డైరెక్టర్.!

Published on Apr 9, 2021 4:07 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ ఇద్దరు హీరోలు కూడా దీని తర్వాత సాలిడ్ లైనప్ నే సెట్ చేసుకున్నారు.

అయితే తారక్ చెయ్యబోయే సినిమాలకు సంబంధించి కాస్త గజిబిజి నడుస్తుంది. త్రివిక్రమ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అని తెలిసిందే. దీని తర్వాత సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సాలిడ్ సినిమా కూడా ఉంది. అయితే వీరితో పాటుగా మరో స్టార్ దర్శకుడు కూడా తారక్ లైన్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

మరి ఈ టాక్ ప్రకారం ఆ దర్శకుడు మరెవరో కాదట తారక్ కెరీర్ లో భారీ హిట్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ మళ్ళీ కాంబో రిపీట్ అయితే ఆ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.

సంబంధిత సమాచారం :