అఖిల్ సినిమా కోసం ఆ స్టార్ హీరోని దింపుతున్నారా.?

Published on Jun 29, 2021 1:00 pm IST

అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ సినిమా కూడా ఒకటి. మరి వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఆ స్టైలిష్ స్పై థ్రిల్లర్ సినిమానే “ఏజెంట్”. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్సమెంట్ తో మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం పై గత కొన్ని రోజులు నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో విలన్ రోల్ కి ఓ ప్రముఖ నటుడు కనిపిస్తారని గాసిప్స్ వినిపించాయి. మరి తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో మళయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి కనిపించనున్నారట. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సాలిడ్ పర్శనాలిటీలో కనిపించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 24 కి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :