మళ్ళీ కరోనా టెస్ట్ చేయించుకున్న ఈ స్టార్ బ్యూటీ.!

Published on Apr 9, 2021 1:59 pm IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మళ్ళీ కరోనా ప్రభావం క్రమక్రంగా పెరుగుతూ వస్తుంది. దీనితో ఈసారి మళ్ళీ సినీ నటులకు కరోనా స్ట్రోక్ గట్టిగా తగులుతూ వస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ నటులు చాలా మేర కోవిడ్ పాజిటివ్ అయ్యారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్స్ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మళ్ళీ తన కరోనా టెస్ట్ చేయించుకున్నట్టుగా తెలిపింది.

గత ఏడాది కరోనా టెస్ట్ అంటే విపరీతంగా భయపడిపోయిన ఈ అమ్మడు ఈసారి ధైర్యంగా కరోనా టెస్ట్ చేయించుకుంది. గత ఏడాది టెస్ట్ ను ఓసారి గుర్తు చేసుకుంటూనే మళ్ళీ తన షూటింగ్స్ నిమిత్తం టెస్ట్ చేయించుకున్నానని తెలిపి తన కరోనా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిపింది. ఇటీవలే వకీల్ సాబ్ నటి నివేతా థామస్ పాజిటివ్ తో ఇప్పుడు క్వారంటైన్ లో ఉంది. మరి పాయల్ కు ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :