తనకి కరోనా టెస్టులు రెగ్యులర్ అంటున్న స్టార్ హీరోయిన్.!

Published on Apr 3, 2021 9:00 am IST

ఇప్పుడు మళ్ళీ కరోనా పంజా దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పెరిగిపోతుందో చూస్తూనే ఉన్నాం. అయితే గత ఏడాదిలా మాత్రం మళ్ళీ ఉండకూడదని చాలా మంది కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా కరోనా వల్ల సినీ పరిశ్రమకు ఎంతటి నష్టం వాటిల్లిందో కూడా తెలిసిందే. మళ్ళీ ఈ ఏడాది పలువురు సినీ తారలు కోవిడ్ బారిన ఎక్కువగానే పడ్డారు.

కానీ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మాత్రం కోవిడ్ పై తన వెర్షన్ ను చెబుతుంది. తాను ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ ను నిర్లక్యం చెయ్యడం లేదని. ముఖ్యంగా తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగ కూడదని రెగ్యులర్ గా కరోనా టెస్టులు చేయించుకుంటూ ఉంటానని తెలిపింది.

అంతే కాకుండా తాను ఎక్కువగా షూటింగ్స్ నిమిత్తం అలా ప్రయాణాలు చెయ్యాలస్సి ఉంటుంది అందువల్ల ప్రస్తుత రోజుల్లో ఇబ్బంది తప్పనిసరి అందుకే కరోనా విషయంలో అన్ని సార్లు టెస్ట్ చేయించుకుంటున్నాని లేటెస్ట్ గా మీడియాలో తెలిపినట్టు తెలుస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆల్రెడీ “క్రాక్”తో పలకరించిన శృతి ప్రస్తుతం పవర్ స్టార్ తో చేసిన “వకీల్ సాబ్”తో రెండో సారి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :