జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?

జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?

Published on Aug 13, 2026 10:05 PM IST

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ అనే మాస్ కథాంశంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ట్రైలర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు.

అయితే, మొదటి సినిమానే అయినప్పటికీ జయకృష్ణ తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ చిత్రం కోసం కథలు వినే పనిలో ఉన్నాడు. కాగా, సూపర్‌స్టార్ కృష్ణకి వీరాభిమాని, మహేష్ బాబుతో పలు చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, జయకృష్ణ రెండవ సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ సుంకర తన బ్యానర్ ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘సామజవరగమనా’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి హిట్లు అందించిన యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో చర్చలు జరిపారు.

ప్రస్తుతం రామ్ అబ్బరాజు ‘సామజవరగమనా 2’ షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, జయకృష్ణ కోసం ఒక కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాది ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

తాజా వార్తలు