పవన్ సాలిడ్ రీమేక్ లో ఈ టాలెంటెడ్ హీరోయిన్.?

Published on Mar 25, 2021 3:00 pm IST

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి పవన్ ఎప్పుడు లేనిది ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో కూడా నటించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “హరి హర వీరమల్లు”తో పాటుగా సాగర్ చంద్ర తో చేస్తున్న మాస్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి రానాకు హీరోయిన్ గా టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ఫిక్స్ కాగా పవన్ కు ఫిమేల్ లీడ్ మాత్రం ఇంకా ఖాళి ఉంది. మొదట్లో సాయి పల్లవిని అనుకున్నా అది జరగక పోవడంతో మేకర్స్ మరి టాలెంటెడ్ హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారట. ఆమెనే నిత్యా మీనన్. నిత్యా పవన్ కు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అనే బజ్ వినిపిస్తుంది. తాను ఈ ఆఫర్ ను ఓకే చేసింది అని టాక్. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :