ఈ తెలుగు హీరోయిన్ నటన ఆకట్టుకుంటుందట !
Published on Aug 28, 2018 5:11 pm IST


తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావు అని నానుడి ఉంది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆడపాదడపా సినిమాలు చేస్తూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తెలుగు హీరోయిన్స్ మాత్రం పెద్దగా కనిపించరు. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినవారి లిస్ట్ ఇలా చాలామందే ఉన్నారు.

కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన అంజలి దగ్గరనుంచి ఈషా రెబ్బా,యామిని భాస్కర్, చాందిని చౌదరి దాకా కొంతమంది తెలుగు హీరోయిన్స్ వచ్చిన సినిమా అల్లా చెయ్యకుండా టాలీవుడ్ లో మంచి గుర్తింపు కోసం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. తాజాగా చాందిని చౌదరి నటించిన కొత్త చిత్రం ‘మను’ త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో చాందిని నటనకి మంచి పేరు వస్తోందని చిత్రబృందం చెబుతుంది. ఇప్పటుకే విడుదలైన ట్రైలర్ లో ఆమె నటన ఆకట్టుకొన్నేలా ఉంది. మరి ఈ చిత్రంతోనైనా ఈ తెలుగు హీరోయిన్ కి సరైన బ్రేక్ వస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook