తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’(Jana Nayagan) భారీ అంచనాలపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విజయ్ చివరి సినిమా కావడంతో అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, సెన్సార్ సమస్యల కారణంగా ‘జన నాయగన్’ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన జనవరి 9న రిలీజ్ చేయడం లేదని.. తమ సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.
దీంతో యావత్ విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కావడంతో థియేటర్లు కూడా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాయి. అయితే, ఈ అయోమయ పరిస్థితి నుంచి ఓ తెలుగు నిర్మాత భలే తప్పించుకున్నారు. తొలుత ఈ భారీ చిత్రాన్ని తెలుగు నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూస్ చేయాలని భావించారట. కానీ, విజయ్ భారీ రెమ్యునరేషన్ కోట్ చేయడంతో ఆయన ఈ సినిమా చేయాలనే ఆలోచన నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. కానీ, రిలీజ్‌కు కొద్ది గంటల ముందు సెన్సార్ సమస్యల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడటంతో మేకర్స్ అయోమయంలో పడ్డారు. మొత్తానికి డివివి భలే తప్పించుకున్నారని తెలుగు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.


