“RRR”లో ఎమోషనల్ చేసే భీకర యాక్షన్ సీన్ అదే.!

“RRR”లో ఎమోషనల్ చేసే భీకర యాక్షన్ సీన్ అదే.!

Published on Jun 1, 2021 2:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంపై గత కొన్ని రోజుల నుంచి సాలిడ్ బజ్ వినిపిస్తూ వస్తున్నాయి.

మరి అలా ఈ చిత్ర రచయిత మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఓ యాక్షన్ సన్నివేశం భారీ అత్యంత భావోద్వేగ పూరితంగా ఉంటుందని తెలిపారు. మరి అది ఎలా ఉంటుంది అన్నదానిపై మరింత క్లారిటీ కూడా ఇచ్చారు. ఇద్దరు మంచి వ్యక్తులు ఒకరితో ఒకరు పోరాడితే ఎలా ఉంటుంది?

అలాంటి వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోకూడదు యుద్ధం చెయ్యకూడదు అని ప్రతీ ఒక్కరూ ఎంతగానో అనుకుంటారు అని తెలిపారు. అంటే ఆ భీకర పోరాట సన్నివేశం తారక్ మరియు చరణ్ లు చేస్తున్న కొమరం భీం, అల్లూరి పాత్రలు ఒకరితో ఒకరు చేసుకునే యుద్ధమే అని అర్ధం అవుతుంది. మరి ఆ అద్భుత యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశం ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు