తన కొత్త సినిమాతో గట్టిగానే ప్లాన్ చేసిన కళ్యాణ్ రామ్.!

Published on May 28, 2021 1:00 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సడెన్ సర్ప్రైజ్ చిత్రం నుంచి మొన్ననే ఒక ఆసక్తికర పోస్టర్ తో హైప్ నమోదు చేసారు. మరి ఈరోజు వారి కుటుంబ ఆద్యులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఈ భారీ చిత్రం టైటిల్ “బింబిసార” అండ్ గ్లింప్స్ ను విడుదల చేశారు.

మన ఇండియన్ సినిమాలోనే అతి తక్కువగా టచ్ చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పైగా అందులో హిస్టారికల్ టచ్ ఇచ్చి సాలిడ్ గా ప్లాన్ చేసినట్టు ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. మొదటి షాట్ లోనే మైండ్ బ్లోయింగ్ విజువల్ తో చూపించి భీకర పోరాట సన్నివేశం అనంతరం కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ లుక్ ను రివీల్ చేశారు.

అలాగే ఆ షాట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చూస్తే ఫాంటసీ థ్రిల్లర్ చిత్రాల ఫాలోవర్స్ మంచి ట్రీట్ కన్ఫర్మ్ అని అర్ధం అవుతుంది. అలాగే చిరంతన్ భట్ ఇచ్చిన సంగీతం కానీ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ కానీ మరింత హైలైట్ అయ్యాయని చెప్పాలి. మరి దర్శకుడు వశిష్ట్ ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ను ఎలా డీల్ చెయ్యనున్నారో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :