ఈసారి మహేష్ “ఖలేజా”?

ఈసారి మహేష్ “ఖలేజా”?

Published on Jul 9, 2024 8:00 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా (SSMB 29) తెరకెక్కబోతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. సో ఈ గ్యాప్ లో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో బర్త్ డే కి రీ రిలీజ్ లతో సరిపెట్టుకుంటున్నారు.

అలా ఇప్పటికే మహేష్ నటించిన సూపర్ హిట్స్ పోకిరి, బిజినెస్ మేన్ లో భారీ హిట్స్ కాగా ఈసారి బర్త్ డే కి అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మరో కల్ట్ క్లాసిక్ చిత్రం “ఖలేజా” రీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. అలాగే ఈ చిత్రంతో పాటుగా మహేష్ మరో ఫ్యామిలీ క్లాసిక్ చిత్రం “మురారి” కూడా అంటున్నారు కానీ దాదాపు ఫ్యాన్స్ అయ్యితే ఖలేజా రీ రిలీజ్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ ఆగస్ట్ 9కి ఏ సినిమా రానుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు